వాటి జోలికి మళ్ళీ వెళ్లడట..!

తెలుగు తమిళ భాషల్లో ఒకేరకమైన ఇమేజ్ సాధించాడు కార్తి. తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యేలా చేసుకున్నాడంటే అతనికి తెలుగులో ఉన్న మార్కెట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈరోజు కాష్మోరాగా మన ముందుకు వచ్చిన కార్తి ఈ సినిమాలో మూడు విభిన్న రకాల పాత్రల్లో నటించి మెప్పించాడు. కార్తిలో ఉన్న నటన అంతా ఈ సినిమాలో బయటపెట్టాడని చెప్పొచ్చు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి తాను ఎంత కష్ట పడ్డాడో చెప్పుకొచ్చిన కార్తి ఇలాంటి సినిమా మళ్లీ చేయాలంటే నా వల్ల కాదు అసలు ఇలాంటి సబ్జెక్ట్ ల జోలికి వెళ్లను అనేశాడు.

మరి కార్తి కేవలం సంవత్సరం మా అంటే ఇంకో ఆరు నెలలకే ఇలా అయితే కష్టం అనుకుంటే రాజమౌళి కోసం ప్రభాస్ దాదాపు మూడు సంవత్సరాలుగా ఏ సినిమా చేయకుండా తన కోసమే ఉన్నాడు. అంతేకాదు దేహ దారుడ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రభాస్ తో పోల్చితే కార్తి తీసుకున్న రిస్క్ ఓ లెక్కా అంటే ఎవరి కష్టం వారిది ఎవరి లెక్కలు వారికుంటాయని అంటున్నారు. కోలీవుడ్ బాహుబలిగా క్రేజ్ తెచ్చుకున్న కాష్మోరా సినిమా అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.     

సినిమా ఏదో హర్రర్ గా థ్రిల్ చేస్తారు అనుకుంటే కామెడీతో కితకితలు పెట్టించారు. మొత్తానికి కార్తి చేసిన ఈ రిస్క్ కు కాసులు కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యేట్టు ఉన్నాయి. మరి సినిమా టాక్ బాగానే ఉన్నా కలక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో వీకెండ్ అయితేనే కాని చెప్పలేం.