రామ్ చరణ్‌కి హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌ చేస్తున్నారు. అది పూర్తికాగానే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ స్టోరీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. అలాగే కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఈ సినిమాలో నటించబోతున్న నటీనటుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఠాకూర్‌, నాచురల్ స్టార్ నానితో కలిసి ‘హై నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్‌ సినిమాకు ఎంపికైతే ఇక ఆమె దశ తిరిగిపోయిన్నట్లే భావించవచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ రేసులో పూజా హెగ్డే వెనుకబడిపోతుండగా, రష్మిక మందన, శ్రీలీల దూసుకుపోతున్నారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌ కూడా వారితో పోటీకి సిద్దమవుతున్నట్లే ఉంది. రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. 

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్‌ 70 శాతం పైగా పూర్తయింది. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలు హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. మరో మూడు నెలల్లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి డిసెంబర్‌లోగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయి కనుక 2024 ఫిభ్రవరి లేదా మార్చిలో విడుదలచేయవచ్చు.