
నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ మరో సినిమా రిలీజ్ చేయాలని సమాయత్తమవుతున్నాడు. ఈ ఇయర్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మన్, మజ్ను సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నాని అదే క్రమంలో నేను లోకల్ అంటూ రాబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు. నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
దీవాళి కానుకగా అందరి కంటే ముందే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నేను లోకల్ పక్కా మాస్ అంటూ సిగరెట్ వెలిగించుకుంటూ నాని ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. భలే భలే మగాడివోయ్ సినిమా నుండి సరికొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న నాని అదే రేంజ్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. అయితే ఇంతకుముందు ప్రయత్నించిన మాస్ ఇమేజ్ కాస్త బెడిసికొట్టగా కొత్తగా నేను లోకల్ అంటూ మరోసారి ఆ ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తుంది.
లక్కీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్రయూనిట్ అంటున్నారు. ఇప్పటికే సగం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి నేను లోకల్ అంటున్న నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.