కొణిదెల కొదమసింహం..!

మెగా హీరోల్లో మెగా పవర్ స్టార్ కాస్త వెనుకపడ్డాడన్నది ఓపెన్ టాక్. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ ఈ రెండు మెగా అభిమానులను అలరించలేదు. అంతేకాదు బ్రూస్ లీలో ఏకంగా మెగాస్టార్ కెమియో ఉన్నా సినిమాను కాపాడలేకపోయింది. అందుకే కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నాడు చెర్రి. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా ధ్రువ చేస్తున్న చరణ్ ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమాకు సిద్ధమయ్యాడు.

ఇక ఇదే కాకుండా రీసెంట్ గా ఓ కుర్ర దర్శకుడు చెప్పిన స్టోరీకి ఫిదా అయ్యాడట చరణ్. లైన్ నచ్చడంతో చెర్రి ప్రొసీడ్ అవ్వమన్నట్టు టాక్. చరణ్ ఆ స్క్రిప్ట్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం అదో కౌబోయ్ తరహా చిత్రమట. సహజంగా తన అభిరుచికి తగ్గ కథ నచ్చితేనే అవకాశం ఇచ్చే చరణ్ ఏకంగా కొదమ సింహం లాంటి స్టోరీతో వస్తే కాదంటాడా చెప్పండి.. వెంటనే ఆ కథను డెవెలప్ చేసుకు రమ్మని చెప్పాడట.   

అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రాం చరణ్ కౌబోయ్ గెటప్ వేయడం ఖాయమన్నట్టే. సూపర్ స్టార్ కృష్ణ మొదలు పెట్టిన ఈ కౌబోయ్ సినిమా ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కొదమ సింహంలో కౌబోయ్ గా అలరించారు. ఆ తర్వాత మహేష్ టక్కరి దొంగ తీసిన అంత వర్క్ అవుట్ కాలేదు. మరి చెర్రి వేసే ఈ కౌబోయ్ వేశం ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.