నాని, మృణాల్ ఠాకూర్ సినిమా ఫస్ట్-లుక్‌ గ్లింప్స్

సల్మాన్ దుల్కర్‌తో కలిసి సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో శౌర్యన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సగంపైగా పూర్తయిపోయింది.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి, కెఎస్ మూర్తి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషామ్ అబ్దుల్ వాహబ్:  సంగీతం, సను జాన్ వర్గీస్: ఫోటోగ్రఫీ, ప్రవీణ్ ఆంటోనీ: ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 25న క్రిస్మస్ పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఫస్ట్-లుక్‌ గ్లింప్స్ జూలై 13న విడుదల చేయబోతున్నట్లు నాని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.