పవన్‌ కళ్యాణ్‌ ఏలూరులో... ఓజీ హైదరాబాద్‌లో బిజీ!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏలూరులో రాజకీయ యాత్రలతో బిజీగా ఉండగా, దర్శకుడు సుజీత్ హైదరాబాద్‌లో ఓజీ సినిమాని చకచకా పూర్తిచేసేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్రల గురించి ముందే ప్లాన్ చేసుకోనందున, ముందుగా తాను చేస్తున్న సినిమాలలో తన పాత్రను చాలా వరకు పూర్తి చేసేశారు.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీలో గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ తన పాత్రకు సంబందించి కొన్ని సన్నివేశాలను కొంతవరకు ముందే పూర్తి చేసేశారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ లేకపోయినా మిగిలిన నటీనటులతో సుజీత్ ఓజీ హైదరాబాద్‌లో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టేశారు. ఈ విషయం ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఓ తాజా ఫోటోను కూడా పెట్టింది. 

ఓజీలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ దాస్, కమల్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.