మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి మరోపాట... లేడిలక్కు నువ్వే!

మహేష్ బాపు దర్శకత్వంలో స్వీటీ అనుష్క, నవీన్ పోలిశెట్టి జోడీగా వస్తున్న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆగస్ట్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన హతవిధీ... లిరికల్ వీడియో సాంగ్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకొంది. తాజాగా నా లేడీ లక్ నువ్వే...” అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్‌ అయ్యింది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటను రాధన్ స్వరపరచగా కార్తీక్ హుషారుగా ఆలపించాడు.

ఈ సినిమాలో అనుష్క లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటే, నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించారు. వీరిద్దరి మద్య ఏవిదంగా ప్రేమ చిగురించింది... చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కధ. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలతో నటించి, అరుంధతి, భాగమతి వంటి అనేక లేడీ ఓరియంటడ్ చిత్రాలు చేసిన అనుష్క, యువ నటుడు నవీన్ పోలిశెట్టితో ఇటువంటి రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కనుక ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.

వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 4న  విడుదల కాబోతోంది.