భోళాశంకర్‌ సెకండ్ సింగిల్ ప్రమో...

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జోడీగా వస్తున్న భోళాశంకర్‌ సినిమాలో రెండో పాట ప్రమో విడుదలైంది. ‘జామ్‌ జామ్ జజ్జనక.... తెల్లార్లు ఆడుదాము తైతెక్కా... “ హుషారుగా సాగే పార్టీ సాంగ్‌కి ఈ సినిమాలో నటిస్తున్న వారందరూ స్టెప్పులేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్‌ మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

కొన్ని రోజుల క్రితం ఈ పాట చిత్రీకరణ సమయంలో ‘చిరు లీక్స్’ అంటూ కొన్ని ఫోటోలు, వీడియో చిరంజీవి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకొన్నారు. 

భోళాశంకర్‌లో చిరంజీవి కోల్‌కతాలో టాక్సీ డ్రైవరుగా, తమన్నా లాయరుగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, కాశి విశ్వనాథ్, బ్రహ్మాజీ, వేణు, సుశాంత్, ఉత్తేజ్, రవిశంకర్, హైపర్ ఆది, తరుణ్ అరోరా, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, గెటప్ శ్రీను, షావార్ ఆలీ, సితార, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డైలాగ్స్: మామిడ్ల తిరుపతి, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఫోటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ అందిస్తున్నారు. 

భోళాశంకర్‌ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.