
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ప్రధాన పాత్రలలో వస్తున్న బ్రో సినిమాలో మార్క్ అదే... మార్కండేయులు ఇంట్రడన్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది.
“కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో... యమా యమా బీట్స్ బ్రో... జిందగీనే జూకు బాక్స్ బ్రో... రచ్చో రచ్చ రాక్స్ బ్రో... మజా పిచ్చ పీక్స్ బ్రో...మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో అంటూ సాగే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్‌కి డ్యాన్స్ మూమెంట్స్ కాస్త స్లోగా అనిపించాయి. తమన్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా అనిపించదు.
“మైడియర్ మార్కండేయ మంచి మాట చెపుతా రాసుకో... మళ్ళీ పుట్టి భూమ్మీదకు రానేరావు నిజం తెలుసుకో...” అంటూ మద్యలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం బాగుంది.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.