
మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో పక్కింటి అబ్బాయిగా మెప్పించిన ఆనంద్ దేవరకొండ ఈసారి సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ సినిమాతో జూలై 14న మన ముందుకు రాబోతున్నాడు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం బేబీ ట్రైలర్ విడుదల చేసింది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ట్రైలర్‌లో చెప్పేశారు. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కానీ సరిగ్గా తీసి ప్రేక్షకులను మెప్పిస్తే ఎన్నిసార్లయినా చూసి హిట్ చేస్తారని తెలిసిందే.
“ప్రతీ కష్టానికి ముందు దేవుడు ఏదో ఓ సిగ్నల్ ఇస్తాడు... ఇలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకివ్వలే?” అనే హీరో డైలాగ్, “తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకీ కొవ్వు? మీ అంత బలం లేకపోవచ్చు... కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకేవ్వరూ కొట్టలేరు,” అనే హీరోయిన్‌గా డైలాగ్ గుండెలను తాకుతాయి. కనుక దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాతో మెప్పిస్తాడనే ఆశిద్దాం.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా వైష్ణవీ చైతన్య నటించింది. ఇంకా విరాజ్ అశ్విన్, సీత, నాగబాబు, పృధ్వీ, లిరిష, సాత్విక్ ఆనంద్, కుసుమ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్ చేశారు.
ఈ సినిమాను ఎస్‌కెఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై శ్రీనివాస్ కుమార్ నిర్మించారు. జూలై 14న ఆనంద్ దేవరకొండ తన ‘బేబీ’తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.