1.png)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే జంటగా ప్రాజెక్ట్-కె వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమాకి సంబందించి మరో అప్‌డేట్ ఇచ్చింది ఆ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ నెల 19న అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరుగబోతున్నాయి. ఆ వేడుకలు మొదలైన మర్నాడు అంటే జూలై 20న ప్రాజెక్ట్-కె టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నారు.
ప్రాజెక్ట్-కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ శాస్త్రవేత్తగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ ఓ గొప్ప పరికరాన్ని తయారుచేస్తే, విలన్‌గా నటిస్తున్న కమల్‌హాసన్ దానిని దొంగిలించి యావత్ ప్రపంచానికే ముప్పు తెస్తాడు.
అప్పుడు హీరో ప్రభాస్ రంగంలో దిగి కమల్‌హాసన్‌తో పోరాడి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకొని ప్రపంచాన్ని కాపాడాడనేది ఈ సినిమా కధ అని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి కధలు హాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతీయ సినీ పరిశ్రమ కూడా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని ఈ సినిమా నిరూపించబోతోంది.
ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్, దీపికా పడుకొనే, బిగ్-బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 12న విడుదలకాబోతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ‘సలార్’ టీజర్ గురువారం విడుదలైంది. సలార్‌లో హీరోయిన్‌గా శ్రుతీహాసన్, విలన్ రాజమన్నార్‌గా జగపతి బాబు, మరో విలన్‌గా పృధ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, తమిళ నటి శ్రీయరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతోంది.
𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓!
San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk