
విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే సత్యదేవ్ తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇవాళ్ళ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘గరుడ ఛాప్టర్-1’ అని టైటిల్ ఖరారు చేస్తూ ఓ ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాతో క్రాంతి బాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సత్యదేవ్ ఓ చేతిలో కాగడా, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని ఉండగా వీపుపై ఓ చిన్నారి పట్టుకొని ఉంటుంది. పక్కనే ఓ కుక్క కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తగలబడుతున్న ఊరుని చూపారు. ఈ తొలి పోస్టర్‌తోనే ఇది చాలా సీరియస్ ఈ సినిమా అని అర్దమవుతుంది. శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు.