త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్‌... రెండో షెడ్యూల్ షూటింగ్‌ షురూ

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ మొదటి షెడ్యూల్ షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. అయితే మద్యలో పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో ఉభయగోదావరి జిల్లాలలో రాజకీయ పర్యటనలు బ్రేక్ తీసుకోవడంతో రెండు షెడ్యూల్ ఆలస్యమైంది. పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ముగించుకొని మళ్ళీ షూటింగ్‌లకు సిద్దం అవడంతో త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్‌ రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈరోజు ట్విట్టర్‌లో ప్రకటించింది. దీని కోసం హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి అధ్వర్యంలో ఓ అద్భుతమైన సెట్ సిద్దం చేస్తున్నారు. 

ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.