ఆగస్ట్ 4న వస్తున్న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి

స్వీటీ అనుష్క, మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కలిసి మహేష్ బాపు దర్శకత్వంలో చేస్తున్న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి రొమాంటిక్ కామెడీ సినిమా ఫస్ట్-లుక్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా ఆగస్ట్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు యూవీ క్రియేషన్స్‌ ప్రకటించింది. 

ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన హతవిధీ... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ చాలా వెరైటీగా యువతను ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమాలో అనుష్క లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటే, నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు. ఇంత దూరంగా ఉంటున్న వారిద్దరూ ఎలా కలిశారు? వారి మద్య ఎలా ప్రేమ చిగురించింది... తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా. ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.