.jpg)
ప్రభాస్ తొలిసారిగా ఓ పౌరాణిక పాత్రలో అదీ... శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంతో దర్శకుడు ఓం రౌత్ ప్రయోగాలు చేయకపోయింటే, ప్రభాస్ కెరీర్‌లో అదో మైలురాయిగా నిలిచిపోయేది. కానీ ఓం రౌత్ కారణంగా అలాంటి గొప్ప అవకాశం చేజారిపోయింది. జూన్ 16న ధియేటర్లలో విడుదలైన ఆదిపురుష్ గురించి ఎవరూ మాట్లాడుకొనేవారే లేరంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఆదిపురుష్ హడావుడి అయిపోయింది కనుక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమాపై అందరి దృష్టి ఉంది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుసగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు బోర్లా పడ్డాయి కనుక ఇప్పుడు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ సినిమాతో ప్రభాస్‌కు తప్పకుండా హిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. కనుకనే ఏమాత్రం తొందరపడకుండా సలార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేందుకు దర్శక, నిర్మాతలు సిద్దం అవుతున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు హోంభలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా, శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇంకా జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
హోంభలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న సలార్‌కు భువన్ గౌడ: సినిమాటోగ్రఫీ, రవి బస్‌రూర్: సంగీతం, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేస్తున్నారు.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
— Salaar (@SalaarTheSaga) July 3, 2023
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh