భోళాశంకర్‌ షూటింగ్‌ సమాప్తం.. అందరికీ కృతజ్ఞతలు!

చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న భోళాశంకర్‌ సినిమా షూటింగ్‌ పూర్తయిందని దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాని పూర్తి చేయడానికి రేయింబవళ్ళు కష్టపడిన యూనిట్‌లో ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. భోళాశంకర్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని , త్వరలోనే ఈ సినిమా పాటలు విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభిస్తామని మెహర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తదితరులతో తీసుకొన్న ఫోటోలను చిరంజీవి అభిమానులతో షేర్ చేసుకొన్నారు. 

భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమా కూడా వాల్తేర్ వీరయ్యలాగే మాస్ ఎంటర్‌టైనర్. నుక దీనిలో కూడా చిరంజీవి డ్యాన్సులు, డైలాగులు, కామెడీ, ఫైట్స్ అన్నీ పుష్కలంగా ఉండబోతున్నాయి. 2015లో తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి భోళాశంకర్‌ తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. భోళాశంకర్‌కి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ చేశారు. ఆగస్ట్ 11న భోళాశంకర్‌ విడుదల కాబోతోంది.