
బోయపాటి-రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ‘స్కంధ’ అని వినిపించిన ఊహాగానాలు నిజమేనని ధృవీకరిస్తూ అదే పేరును ఖరారు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ అంటూ చిన్న వీడియోని కూడా విడుదల చేశారు. పుష్కరిణిలో దేవతామూర్తులకు చక్రస్నానం చేయిస్తుండగా హీరో, విలన్ల మద్య ఫైట్ దీనిలో చూపారు.
“మీరు దిగితే ఊడేది ఉండదు... నేను దిగితే మిగిలేది ఉండదు,” అనే డైలాగుతో వీడియోని ప్రజంట్ చేశారు. బోయపాటి సినిమాలో కధ కంటే యాక్షన్, పంచ్ డైలాగ్స్‌కే ఎక్కువ పాపులర్ కనుక ఈ సినిమా కూడా అదేవిదంగా పక్కా మాస్ మసాలా సినిమాగా తీస్తునట్లు ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: ధమన్, కెమెరా: సంతోష్ డేటకే, స్టంట్స్: స్టంట్ శివ, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్.
ఇప్పుడు ప్రతీ సినిమాను పాన్ ఇండియా మూవీలుగా నిర్మించే ట్రెండ్ నడుస్తోంది కనుక దీనిని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. స్కంద సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది.