బ్రో... ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌ జూలై 3న!

బ్రో టీజర్‌ హంగామా ఇంకా పూర్తికానేలేదు. అప్పుడే మొదటి సాంగ్‌ విడుదల గురించి ప్రకటించేశారు. జూలై 3వ తేదీన బ్రో తొలి పాట విడుదల కాబోతోంది. ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ఈ విషయం ప్రకటించడం విశేషం. ఈ నెలంతా బ్రో సినిమా పాటలతో అలరించబోతున్నామని ధమన్ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్వరలోనే అప్‌డేట్ ఇస్తారని ధమన్ ట్వీట్‌ చేశారు. ఇక నుంచి సినిమా బ్రో జూలై 28న సినిమా విడుదలయ్యే వరకు బ్రో హడావుడి బాగానే ఉంటుంది. 

సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలలో వస్తున్న బ్రో చిత్రంలో తేజ్, కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.