
అల్లరి నరేష్... వరుసపెట్టి 50 కామెడీ సినిమాలు చేసి ఆ పేరు సార్ధకం చేసుకొన్నాడు. అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోవడం ఇష్టంలేక సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. వాటిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నాడు కానీ సరైన హిట్ పడటం లేదు. అదీగాక ఇండస్ట్రీలో తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చి మంచి నటుడిగా నిలబెట్టిన కామెడీ సినిమాను మళ్ళీ ప్రయత్నిద్దామనుకొన్నట్లున్నాడు. తన 62వ చిత్రాన్ని ఆ జోనర్‌లో చేయబోతున్నాడు.
నరేష్ చివరిగా చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను నిర్మించిన హాస్య మూవీస్ సంస్థ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి నిర్మించబోతున్నారు. వారు ఈ సినిమాను పరిచయం చేసిన విధానం చాలా వెరైటీగా ఉంది. “మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కధ ఇది” అని చెప్పేశారు కనుక అది ఏవిదంగా మొదలైందో మీరే స్వయంగా చూసి అనందించండి.
సుబ్బు మంగదేవి కధ, దర్శకత్వంలో మొదలుపెట్టబోతున్న ఈ సినిమాలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: విశాల్‌కి చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్మెల్యే నాధన్, ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి.