ఏంటిది బ్రో... ఎప్పుడూ లేటేనా?

సముద్రఖని దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరం ప్రధానపాత్రల 'బ్రో' సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తామని చెప్పి, ఉదయం నుంచి మరో నాలుగు గంటలు, మరో రెండు గంటలు, మరో 30 నిమిషాలే మిగిలుంది అంటూ అభిమానులను ఆతృతను పెంచుతూపోయారు.

అయితే కొద్ది సేపటి క్రితం, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సమయానికి బ్రో టీజర్ విడుదల చేయలేకపోయినందుకు చింతిస్తున్నాము. కనుక మాస్ సెలబ్రేషన్స్ చేసుకొనేందుకు మరికొద్ది సేపువేచి చూస్తే మేము ఈ సమస్యను పరిష్కరిస్తాము," అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే మరికొద్ది సేపటిలో టీజర్ తప్పకుండా విడుదలవుతుందని భావించవచ్చు.   

ఈ సినిమాలో కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు  ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదలకాబోతోంది.