ప్రభాస్‌ ప్రాజెక్ట్-కె తాజా అప్‌డేట్స్

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, కమల్‌హాసన్‌, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే ప్రధాన పాత్రలలో సిద్దమవుతున్న ప్రాజెక్ట్-కె సినిమాకు సంబందించి కొన్ని తాజా అప్‌డేట్స్ వచ్చాయి. ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్‌లో బ్యూటీ దీపికా పడుకొనే హైదరాబాద్‌ చేరుకొంది. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లు కలిసి కొన్ని సన్నివేశాలలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే చివరి షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. దీనిలో తొలిసారిగా ప్రభాస్‌, కమల్‌హాసన్‌ కలిసి నటించనున్నారు. 

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ సైంటిస్ట్‌గా నటిస్తుంటే, కమల్‌హాసన్‌ ఆయన తయారుచేసిన పరికరాన్ని దొంగిలించి ప్రపంచంలో విధ్వంసం సృష్టించే విలన్‌గా నటించబోతున్నారు. అప్పుడు మన హీరో ప్రభాస్‌ ఆయనను ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడతాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషలలొ కూడా దీనిని విడుదల చేయబోతున్నారు. 

ప్రభాస్‌ కెరీర్‌లో ఇది అన్నిటికంటే భారీ బడ్జెట్‌ సినిమాగా నిలువబోతోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తీయబోతున్నాట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ నుంచి ఆ ప్రమాదకరమైన పరికరాన్ని కమల్‌హాసన్‌ ఎత్తుకుపోవడంతో మొదటి భాగం ముగుస్తుందని సమాచారం. దీనిలో టైమ్ మెషీన్ కూడా ఉన్నట్లు తెలుస్తోది. రెండో భాగంలో ప్రభాస్‌ ఆ టైమ్ మిషన్ గుండా భవిష్యత్‌లోకి వెళ్ళి కమల్‌హాసన్‌ను ఏవిదంగా అడ్డుకొంటాడనేది కధ. 

ఈ సినిమాలో బిగ్‌-బి అమితాబ్ బచ్చన్‌, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.ఈ సినిమా 2024, జనవరి 12న విడుదల కాబోతోంది.