ఆగస్ట్ 25న వస్తున్న గాంఢీవధారి అర్జున

వరుణ్ తేజ్‌, సాక్షి వైద్య జోడీగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ సినిమా షూటింగ్‌ పూర్తయిందని సినీ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ తెలియజేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యం కావచ్చని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముందుగా ప్రకటించినట్లే ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కాబోతోందని తెలియజేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫైటర్ జట్ పైలట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్స్ బట్టి తెలుస్తోంది. 

ఈ సినిమాను ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు కలిసి నిర్మిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే తొలిసారిగా చాలా భారీ బడ్జెట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను అమెరికా, యూరోపియ‌న్ దేశాల‌లో షూట్ చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్, ఆర్టిస్ట్‌: అవినాష్ కొల్ల అందిస్తున్నారు.