తరుణ్ భాస్కర్ కీడాకోలా టీజర్‌

మంచి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా నిరూపించుకొన్న తరుణ్ భాస్కర్‌ దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత ‘కీడా కోలా’ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎటువంటి హడావుడి చేయకుండా ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తిచేశారు. ఈ సినిమా టీజర్‌ కూడా నేడు విడుదల చేశారు. 

ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌లో ‘క్రైమ్ అండ్ కామెడీ’ గా ఉండబోతోందని ముందే చెప్పేశారు. కూల్ డ్రింక్‌ సీసాలలో బొద్దింకలు లేదా కూల్ డ్రింక్స్ తయారీకి పురుగుల మందులకు మద్య ఏదో కనెక్షన్ పెడుతూ ఈ సినిమాను తీస్తున్నట్లు టీజర్‌ చూస్తే అర్దమవుతోంది. 

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్,  బ్రహ్మానందం, చైతన్య రావు. రాహుల్ గాంధీ మయూర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఎజే ఆరోన్, ఎడిటింగ్: ఉపేంద్ర రాంగోపాల్ వర్మ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందబోతున్న ఈ సినిమాని భరత్ కుమార్‌ శ్రీపథ్, నందిరా జె ఉపేంద్ర రాంగోపాల్ వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్‌ కలిసి విజి సైన్మా, క్విక్ ఫాక్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.