
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్‌లో అల్యూమియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. జూలై 4వరకు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత బాలయ్య, శ్రీలీల ఇద్దరూ అమెరికాలో జరుగబోయే తానా సభలలో పాల్గొనేందుకు జూలై 5న అమెరికా బయలుదేరివెళతారు.తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటారు.
ఈ సినిమాలో బాలకృష్ణ, కాజల్ దంపతులుగా నటిస్తుంటే వారి కూతురుగా శ్రీలీల నటిస్తోంది. తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమాగా అనిల్ రావిపూడి దీనిని తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు కనుక తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ చెపుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. బాలయ్య, శ్రీలీల అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా పూర్తయ్యేవరకు షూటింగ్‌లో పాల్గొంటారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగకి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: అందిస్తున్నారు.