రుద్రంగి ట్రైలర్‌లో జగపతిబాబుని చూశారా?

తెలుగు సినీ పరిశ్రమలో జగపతిబాబు పరిచయం అక్కర్లేని గొప్ప నటుడు. ఆయన తన మొదటి ఇన్నింగ్స్‌ ఫ్యామిలీ హీరోగా అనేక సినిమాలు చేశారు. అయితే కొత్తతరం నటులు ప్రవేశించడంతో ఆయన కెరీర్‌కు బ్రేక్ పడినట్లయింది. అయితే అదే ఆయనకు వరంగా కూడా మారింది. అప్పుడే తెలుగు సినీ పరిశ్రమకు అచ్చమైన ఓ తెలుగు విలన్ లభించాడు. జగపతిబాబు విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన తర్వాత తన వయసుకు తగ్గట్లుగా తండ్రి, అన్న వంటి పాత్రలు కూడా చేస్తూ విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నారు. 

తాజాగా తెలంగాణ చారిత్రిక నేపధ్యంతో వస్తున్న రుద్రంగి సినిమాలో జగపతిబాబు క్రూరుడైన దొర భీమ్‌రావుగా నటించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. దానిలో జగపతిబాబు నటన చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆనాడు తెలంగాణ ప్రజలను దొరలు ఏవిదంగా హింసిస్తుండేవారో జగపతిబాబు కళ్ళకు కట్టిన్నట్లు దానిలో చూపారు. 

రుద్రంగి సినిమాలో జగపతిబాబుకు జోడీగా విమలా రామన్, మమతా మోహన్ నటించారు. ఆశిష్ గాంధీ, గనవి లక్ష్మణ్, కాలాకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నందా, ఆదిత్య తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: నవఫాల్ రాజా, కెమెరా: సంతోష్ షనమోని, స్టంట్స్: రామ్ సుంకర, ఝాషువా, కొరియోగ్రఫీ: భాను, అజయ్ చేశారు. 

ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే, ప్రముఖ గేయరచయిత, బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జిఎస్‌కె మీడియా బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా జూలై 7వ తేదీన విడుదలకాబోతోంది.