ఓజీ విన్నారా... బడ్జెట్‌ రూ.4-500 కోట్లట!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ సబ్ టైటిల్‌) యాక్షన్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. 

ఆ సినిమాలో నటిస్తున్న కమల్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను చాలా ఏళ్ళుగా సినీ పరిశ్రమలో  ఉన్నాను. నా అనుభవంతో చెప్పేది ఏమిటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డులు బద్దలుకొట్టబోతోంది. అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ని ఏవిదంగా చూడాలనుకొంటున్నారో ఆ విదంగా సుజీత్ చూపించబోతున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ గెటప్, యాక్షన్ సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. 

ముంబైలో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో నేను పాల్గొన్నప్పుడు, ఆ సెటప్, గెటప్, టేకింగ్, టెక్నీషియన్స్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత డీవీవీ దానయ్యగారు బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ ఎంతని ఖచ్చితంగా చెప్పలేను కానీ సుమారు రూ.4-500 కోట్లు ఉండొచ్చని నేను అనుకొంటున్నాను. ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమాగా నిలుస్తుందని చెప్పగలను. ఇటువంటి గొప్ప సినిమాలో నేను కూడా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అని చెప్పారు. 

ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్న అర్జున్ దాస్ కూడా ఓజీ సినిమా గురించి చేసిన ట్వీట్స్ అభిమానులకు చాలా ఆనందం కలిగిస్తాయి. ఈ సినిమా దర్శకుడు సుజీత్ తనకు కొన్ని విజువల్స్ చూపించాడని అవి చాలా అద్భుతంగా ఉన్నాయని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ స్క్రీన్ ప్రజన్స్, డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ట్వీట్‌ చేశారు. 

ఓజీ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్‌భవన్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు.