నారాయణ అండ్ కో ట్రైలర్‌ చూశారా?

ఇటీవల కొత్త దర్శకులు, కొత్తకొత్త కధలతో తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటిదే జూన్ 30న విడుదల కాబోతున్న ‘నారాయణ అండ్ కో’ సినిమా కూడా. చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో తెర కెక్కించిన ఈ సినిమా పూర్తి కామెడీ చిత్రమని ఈరోజు విడుదలైన ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది.

ఈ సినిమాలో కోమాకుల సుధాకర్ హీరోగా నటించాడు. సప్తగిరి, తోటపల్లి మధు, రాగిణి, ఆమని, రామచంద్రపు శివ, దేవిశ్రీ ప్రసాద్, ఆరతి పోడి, యామినీ, పూజా కిరణ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: చిన్న పాపిశెట్టి, కధ: రాష్ట్ర వ్యాప్తంగా గోలి, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, సంగీతం: కమ్రాన్, డాక్టర్ జోస్యభట్ల శర్మ, నాగ వంశీ, సురేశ్ బొబ్బిలి, కొరియోగ్రఫీ: విజయ్‌ పోలాకి, మోహన్ కృష్ణ, ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి  చేశారు. 

పాపిశెట్టి ఫిలిమ్ ప్రొడక్షన్స్ మరియు సుక మీడియా బ్యానర్లపై సుధాకర్ కోమాకుల, పాపిశెట్టి బ్రదర్స్ నిర్మించారు.