మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల కలిసి నటించిన ధమాకా సూపర్ హిట్ అయినప్పటికీ తర్వాత వెంటనే విడుదలైన రావణాసుర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనుక స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితగాధ ఆధారంగా తీసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాపై రవితేజ ఆశలు పెట్టుకొన్నారు. ఇది ఆగస్ట్ 20న విడుదల కాబోతోంది. దీనిలో రవితేజకు జోడీగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఈ నెల 24న రాజమండ్రిలో గోదావరి రైల్వే బ్రిడ్జీపై రైలును అడ్డగించి దోపిడీ చేస్తున్నట్లు చూపించి, ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దీని తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో మళ్ళీ శ్రీలీలను రవితేజకు హీరోయిన్గా ఎంపికచేసిన్నట్లు తెలుస్తోంది. శ్రీలీల 2021 ‘పెళ్ళి సందD’తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. 2022లో రవితేజతో ధమాకా సృష్టించి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ కూతురుగా భగవంత్ కేసరి సినిమాలలో నటిస్తోంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా, వైష్ణవ్ తేజాతో ఆదికేశవ, అనగనగా ఒకరోజు, బోయపాటి-రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలలో శ్రీలీల చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ రవితేజకు హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకొంటోంది.