భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ ఫస్ట్-లుక్‌ చాలా డీసెంట్!

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ ఆయనకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలో ఆమె ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ చిత్రబృందం విడుదల చేసింది.

చక్కగా చీరకట్టుకొని కాస్త పెద్ద కళ్ళద్దాలతో చేతిలో సైకాలజీకి సంబందించిన పుస్తకం చదువుతున్నట్లు చూపారు. అంటే ఆమె సైకాలజీ ప్రొఫెసర్ లేదా వైద్యురాలు అయ్యుండవచ్చని అర్దమవుతోంది. ఇంతకాలం హీరోయిన్‌గా అలరించిన కాజల్ అగర్వాల్, ఈ సినిమాలో తొలిసారిగా బాలయ్యకు భార్యగా, శ్రీలీలకు తల్లిగా నటిస్తుండటం విశేషం. అయితే బాలయ్య పక్కా మాస్, కాజల్ అగర్వాల్ క్లాస్.... వీరిద్దరి కూతురు శ్రీలీల వెరీ హాట్. కనుక ఈ సినిమా చాలా ఆసక్తికరంగానే ఉండబోతున్నట్లనిపిస్తోంది. 

మరో విశేషమేమిటంటే ఈ సినిమా కధ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కనుక తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ ఉంటాయి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు టైటిల్‌-పోస్టర్‌ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ “గిప్పడి సంది ఖేల్ అలగ్” అంటూ తెలంగాణ యాసలో చిన్న హింట్ ఇవ్వగా, శ్రీలీల కూడా “అన్న దిగిండు ఇగ మాస్ ఊచకోత షురూ..” అంటూ మరో హింట్ ఇచ్చింది. 

ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తికావస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగకి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా:  అందిస్తున్నారు.