
జనతా గ్యారేజ్ హిట్ అవ్వడంతో క్రేజ్ లో ఉన్న ఎన్.టి.ఆర్ ఇక పై తన తర్వాత సినిమా కథల మీద ద్రుష్టి పెట్టాడు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇజం హిట్ అయితే తన తర్వాత సినిమా పూరితో చేయాలనుకున్న తారక్ ప్రస్తుతం అంత డేర్ చేయలేకపోతున్నాడు. ఇజం ప్లాప్ అవ్వడంతో పూరి ఎన్.టి.ఆర్ సినిమా రేసులో ఇక లేనట్లే.
ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని వార్తలు వినిపించినప్పటికీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా చేయడంతో తారక్ తో సినిమా ఇప్పట్లో లేనట్లే అంటున్నారు.
ఇంతకు ముందే త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ స్టోరి డిష్కషన్ లో ఉండగా మహేష్ కి సిద్దం చేసిన కథ ప్రస్తావనకు వచ్చిందట. అయితే తనకు చెప్పిన లైన్ కన్నా మహేష్ కథ అద్భుతంగా ఉండటంతో తనతో ఆ సినిమా చేయమని లాబీయింగ్ చేస్తున్నాడట ఎన్.టి.ఆర్. త్రివిక్రమ్ మాత్రం దానికి ఒప్పుకోవట్లదని ఫిల్మ్ సర్కిల్స్ టాక్.