
మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గుంటూరు కారం తర్వాత షెడ్యూల్ ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా 12కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఏకంగా జూలైకి వాయిదా పడిన్నట్లు తెలుస్తోంది. సినిమాలో నటిస్తున్న కొందరు నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమో సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. దానిని మార్చితే మళ్ళీ అటువంటి గొప్ప అవకాశం లభించదు కనుక ఆ రోజునే విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే సినిమా షూటింగ్‌లో ఏకంగా ఒక నెల వృధా అయినందున, త్రివిక్రం శ్రీనివాస్ సినిమా షూటింగ్ వేగవంతం చేయాల్సి ఉంటుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే, ఆమె చెల్లెలుగా శ్రీలీల నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.