పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి ఏమిటి?

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓజీ, తో హరిహరవీరమల్లు, సముద్రఖనితో బ్రో, హరీష్ శంకర్‌ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాలు చేస్తున్నారు. వాటిలో బ్రో ఒక్కటే పూర్తి చేశారు. మిగిలిన సినిమాల షూటింగ్‌లు వివిద దశలలో ఉన్నాయి. వాటి కోసం పూర్తి టైమ్ కేటాయించి షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్‌ కళ్యాణ్‌ హటాత్తుగా అన్నిటినీ నిలిపివేసి ఏపీలో వారాహితో రాజకీయ యాత్ర పెట్టుకొన్నారు.  

ఇటువంటి సమయంలో సినిమా షూటింగ్‌లు నిలిపివేయడంతో ఆ సినిమాల దర్శక, నిర్మాతలు సోమవారం మంగళగిరి వెళ్ళి పవన్‌ కళ్యాణ్‌ కలిసి తమ సినిమాల పరిస్థితి ఏమిటని అడిగారు. తాను రాజకీయ కార్యక్రమాలను కూడా చూసుకోవలసి ఉంటుంది కనుక ఈ మూడు సినిమాల షూటింగ్‌లు గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్లాన్ చేసుకోవాలని కోరారు.

తాను పగలు వారాహితో రాజకీయ యాత్రలు ముగించుకొని, సాయంత్రం నుంచి షూటింగ్‌లో పాల్గొంటానని పవన్‌ కళ్యాణ్‌ వారికి హామీ ఇచ్చారు. అందుకు దర్శక నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ పగలంతా మండుటెండల్లో తిరుగుతూ రాజకీయ సమావేశాలలో పాల్గొంటూ, సాయంత్రం నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొనడం సాధ్యమేనా?అనే ప్రశ్నకు సమాధానం స్వయంగా చూసి తెలుసుకోవలసిందే.