ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా ఆ స్వామిజీ!

ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిధిగా రాబోతున్నారని యూవీ క్రియేషన్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్, కృతి సనన్‌లతో సహా ఆ సినిమాలో నటించిన పలువురు నటీనటులు, ఆ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. దేశవిదేశాలలో ఉన్నవారి కోసం ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో లైవ్లో కూడా అందుబాటులో ఉంటుంది. దాని లింక్: https://www.youtube.com/watch?v=CFUQQnqFun0 లో చూడవచ్చు.

 ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా రామాయణ గాధ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నందున ఇది అందరికీ తెలిసిన కధే. ఇప్పటికే అనేక భాషలలో అనేకసార్లు, అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ వచ్చి మంచి ఆదరణ పొందాయి. కనుక ఆదిపురుష్‌ వాటన్నిటికంటే మిన్నగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు నీరాజనాలు పడతారు. సినిమాకు కనకవర్షం కురిపిస్తారు. ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభాస్ కెరీర్‌లో ఇది మరో అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతుంది.     

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఆదిపురుష్‌ ఈనెల 16న విడుదల కాబోతోంది. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.