భోళాశంకర్‌ సాంగ్‌ ప్రమో వచ్చేసింది

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా వస్తున్న భోళాశంకర్‌ సినిమా నుంచి తొలి పాట ఆదివారం విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ భోళాశంకర్‌ టీమ్‌లో ఆ పాట ప్రమో నేడు విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి స్టయిల్‌గా చొక్కా సవరించుకొంటున్న ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇది కూడా వాల్తేర్ వీరయ్యలాగే పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కిస్తున్నారు. భోళాశంకర్‌ చెల్లెలుగా కీర్తి సురేశ్, ఇంకా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ. ఈ ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకాబోతోంది.