
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన సినిమా ఇజం. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ కాస్త పర్వాలేదు అన్నట్టు ఉన్నాయట. అయితే ఈ సినిమాను హిందిలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నాడట పూరి జగన్నాథ్. ఇప్పటికే తెలుగులో ఏ సినిమా హిట్ అయినా దాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసే సల్మాన్ ఖాన్ ఇజం మీద కూడా మనసు పడ్డాడట. ఇజం సినిమా సల్మాన్ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
అసలైతే టెంపర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశాడు పూరి. ఇజం తో పోల్చుకుంటే టెంపర్ సినిమానే మంచి ఫలితాన్ని అందించింది. అయితే అబిషేక్ తో టెంపర్ రీమేక్ ప్రయత్నాలు చేసినా అది కుదరకపోవడంతో ఇప్పుడు ఇజం ను హింది భాషలో తెరకెక్కించాలని చూస్తున్నాడు పూరి. తెలుగులో క్లైమాక్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా తీసి మిగతా అంత తన రొటీన్ కొట్టుడు దంచిన పూరి. హిందిలో కాస్త మార్చబోతున్నాడట.
సల్మాన్ కన్ఫాం చేసిన వెంటనే తాను ఆ పని మొదలు పెట్టబోతున్నాడట.. సో ఇజం ఇక్కడ మాములు ఫలితాన్ని అందించినా ఇక్కడ రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని హిందిలో తెరకెక్కించే పూరి ఎలాంటి అవుట్ పుట్ అందుకుంటాడో చూడాలి.