జూనియర్ పరువు తీసిన జనతా గ్యారేజ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమా బుల్లితెరలో తారక్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని అంటున్నారు. రీసెంట్ గా అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ సినిమా లాస్ట్ వీక్ మా టివిలో టెలికాస్ట్ చేశారు. అయితే సినిమా బుల్లితెర మీద మాత్రం ఫ్లాప్ అంటున్నారు. టి.ఆర్.పి రేటింగ్ అంత ఆశించినంతగా రాలేదట జనతా గ్యారేజ్ సినిమాకు. దీనికి రెండు ప్రధాన కారణాలని తెలుస్తుంది.

ఆ సినిమా మాటివిలో టెలికాస్ట్ అయ్యే రెండు రోజుల ముందే హెచ్.డి ప్రింట్ ఒకటి అప్ లోడ్ చేయడం జరిగింది. ఇక అదే కాకుండా సినిమా మధ్యలో యాడ్స్ బాగా రావడం చేత ప్రేక్షకులు విసిగి పోయి సినిమా చూడలేదన్న టాక్ ఉంది. సో కారణాలు ఏవైనా జూనియర్ ఎన్.టి.ఆర్ కెరియర్ మళ్లీ జోష్ అందించిన జనతా గ్యారేజ్ సినిమా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం అంత సందడి చేయలేదు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టెంపర్ సినిమా కన్నా చాలా తక్కువ టి.ఆర్.పి రేటింగ్ వచ్చిందట జనతా గ్యారేజ్ సినిమాకు. ఈ విషయం పట్ల తారక్ ఫ్యాన్స్ కాస్త కంగారుగానే ఉన్నట్టు సమాచారం. 

అసలైతే తన అభిమాన నటుడి సినిమా మాటివిలో ప్రసారం చేయొద్దంటూ ఫ్యాన్స్ మొన్నామధ్య అల్లరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ దానికి నిరసనగా సినిమా చూసి ఉండక పోవచ్చు. అలా చేస్తే వారి హీరో సినిమాను వారే అవమానించినట్టు అవుతుంది.