పుష్ప2 అప్‌డేట్...ఫహాద్ ఫాసిల్‌ ప్రతీకారంతో తిరిగొస్తున్నాడు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా తెర కెక్కుతున్న ‘పుష్ప2-ది రూల్ ‘ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబందించి తాజా అప్‌డేట్స్ ఇచ్చింది చిత్రబృందం. పుష్పలో భన్వర్ సింగ్‌ షెకావత్ అనే పోలీస్ ఆఫీసరుగా నటించిన మలయాళ సినీ నటుడు ఫహాద్ ఫాసిల్ మీద కొన్ని కీలక సన్నివేశాలు తాజా షెడ్యూల్లో పూర్తిచేశామని తెలియజేసింది. పుష్ప మొదటి భాగంలో క్లైమాక్స్‌లో సన్నివేశంలో పుష్పరాజ్ (అల్లు అర్జున్‌) చేతిలో దారుణ అవమానానికి గురైన “భన్వర్ సింగ్‌ షెకావత్ ప్రతీకారేచ్చతో రగిలిపోతూ తిరిగివస్తున్నాడంటూ,” దానిలో పేర్కొన్నారు. పుష్ప2 లొకేషన్‌ నున్నటి గుండుతో ఫహాద్ ఫాసిల్ దర్శకుడు సుకుమార్‌ కలిసి షాట్ ఎలా వచ్చిందో కెమెరా స్క్రీన్‌లో చూస్తున్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ఈ సీక్వెల్‌ ‘ది రూల్’ అని చేర్చినందున ఈసారి పుష్ప చెలరేగిపోబోతున్నాడని చూచాయగా చెప్పేశారు. ఇప్పుడు “భన్వర్ సింగ్‌ షెకావత్ ప్రతీకారేచ్చతో రగిలిపోతూ తిరిగివస్తున్నాడంటూ,” ట్వీట్‌ చేశారు. అంటే సీక్వెల్లో ఇద్దరి మద్య ఆసక్తి కరమైన సన్నివేశాలు, భీకర పోరాటాలు ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది. 

పుష్ప-1లో నటించిన ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు దీనిలో మరికొంతమంది నటీనటులు వస్తున్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.