నెట్‌ఫ్లిక్స్‌లో విరూపాక్ష... ఎప్పటి నుంచి అంటే...

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా వచ్చిన విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ కలక్షన్స్‌ కొల్లగొడుతోంది. కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకి ముగింపు చెపుతూ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోందని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. 

విరూపాక్ష కధేమిటంటే శాపగ్రస్తమైన రుద్రవనంలో జనాలు చనిపోతుంటారు. ఆ శాపం నుంచి గ్రామాన్ని కాపాడుకోవడానికి గ్రామపెద్దలు గ్రామాన్ని అష్టదిగ్బందనం చేయిస్తారు. దాంతో బయట నుంచి ఆ ఊళ్ళోకి ఎవరూ ప్రవేశించలేరు. లోపల ఉన్నవారు బయటకు వెళ్ళలేరు. ఆ సమయంలో ఆ గ్రామంలో చిక్కుకొన్న సూర్య (సాయిధరమ్ తేజ్) తన ప్రియురాలు నందిని (సంయుక్త)ను కాపాడుకోవడం కోసం ఆ చావుల వెనుక రహస్యాన్ని చేదించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి అతను ఆ రహస్యాన్ని ఛేదించి ఊళ్ళో వాళ్ళను, తన ప్రియురాలిని ఏవిదంగా కాపాడుకొన్నాడనేదే ఈ సినిమా కధ.

దర్శకుడు కార్తీక్ దండు సినిమాలో ఎక్కడా పట్టుతప్పకుండా చాలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే నడిపించి ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలకుండా కూర్చోబెట్టాడు. అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది కనుక అందరూ ఈ సినిమాని ఇంట్లోనే చూసి ఆనందించవచ్చు.