ఈ వారం ఓటీటీలో... సినిమాలు, వెబ్‌ సిరీస్‌

థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలతో పాటు ఫ్లాప్ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా వరుసగా వివిద ఓటీటీలలో  విడుదలవుతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫారంలు కళకళలాడిపోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఇవే... 

అఖిల్ యాక్షన్ చిత్రం ఏజంట్ అంచనాలు అందుకోలేక చతికిలపడటంతో అప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 19 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కాబోతోంది. నిహారిక కొణిదెల, వైవా హర్ష, లింగుస్వామి తదితరులు ముఖ్యపాత్రలలో అతీంచిఒన డెడ్ పిక్సెల్స్ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఈనెల 19 నుంచి డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

ఇవికాక మే 19న నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మలయాళసినిమా ఆయలవాషి, కధల్ సినిమాలు విడుదలకాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో మంగళవారం మోడ్రన్ లవ్ చెన్నై ప్రసారం కాబోతోంది.

ఇవికాక థియేటర్లలో విడుదలై బోల్తాపడిన సమంత నటించిన శాకుంతలం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. బాలీవుడ్‌లో నటి సోనాక్షి సిన్హా తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌ “దిన్ దహాడ్” తెలుగు డబ్బింగ్ మరియు తెలుగు సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటోంది.