
శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖుషి’ నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికావలసి ఉండగా సమంత అనారోగ్యం, లైగర్ సినిమా దెబ్బేయడం వలన ఆలస్యమైంది. ఎట్టకేలకు షూటింగ్ మొదలైంది. ఈరోజు విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్‌లో సమంత కశ్మీరీ ముస్లిం యువతిగా, విజయ్ దేవరకొండ ఆమె వెంటపడుతున్నట్లు చూపారు. బహుశః ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కశ్మీరీ యువకుడు లేదా ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండవచ్చు. కశ్మీర్ నేపధ్యంలో తెల్లపావురాలను బ్యాక్ గ్రౌండ్లో చూపినందున కశ్మీర్లో వేర్పాటువాదంలో ప్రేమ కధను అల్లుకొని ఉండవచ్చనిపిస్తోంది.
“నారోజా నువ్వే...” అంటూ చక్కటి బీట్తో సాగే ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ రచించడం విశేషం. దీనిని హెషామ్ అబ్దుల్ వాహేబ్ చక్కగా స్వరపరచి స్వయంగా ఆలపించారు. మంజు శ్రీ ఆయనతో గొంతు కలిపారు. పాట, సంగీతం, కెమెరా, కొరియోగ్రఫీ అన్నీ బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే కాస్త చిలిపిగా, సమంత కాస్త గుంబనంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ పాటను రక్తి కట్టించారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిన్నట్లే ఉంది కనుక కధ,కధనం బాగుంటే సినిమా సూపర్ హిట్ ఖాయం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది.
ఖుషీలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: మురళి జి, సంగీతం: హషమ్ అబ్దుల్ వాహేబ్ అందిస్తున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/0n7AWxYCj9I" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>