సమంతతో విడిపోవడానికి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు, తనకు సంబంధమే లేని ఓ మూడో వ్యక్తిని ఇందులోకి లాగడం కూడా కారణమే అని ఇటీవలే నాగ చైతన్య తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు శోభితా దూళిపాళ. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఆమెతో అఫైర్ కంటిన్యూ చేస్తున్నాడని, విదేశాలలో వారిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమవగా అవి వైరల్ అయ్యాయి.
అయితే శోభితా దూళిపాళ అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపడేసింది. మణిరత్నం తాజా సినిమా పొన్నియన్ సెల్వన్‌లో ఏఆర్ రహమాన్ పాటకు డ్యాన్స్ చేసే అవకాశం తనకు లభించిందని, ఆ డ్యాన్స్‌ని చూసి అందరూ తనను ప్రశంశిస్తున్నారని, ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తుంటే మద్యలో ఇటువంటి పుకార్లపై స్పందించవలసిన అవసరమే లేదని శోభితా దూళిపాళ అంది.
“ఎవరో ఏదో అన్నారని, నాకు సంబందమే లేని వ్యవహారం గురించి నేను మాట్లాడవలసిన అవసరమే లేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంటుగా మీడియా ముందుకు వెళ్ళి సంజాయిషీలు ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇటువంటి పుకార్లు చాలా కామన్. వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతుంటాను,” అని శోభితా దూళిపాళ అంది.
ఆమె చెప్పింది నిజమే కావచ్చు. కానీ నాగ చైతన్య తాను నటించిన ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సమంతతో విడిపోవడం గురించి మాట్లాడగా, శోభితా దూళిపాళ కూడా నాగ చైతన్యతో ‘అఫైర్’ గురించి మాట్లాడటం యాదృచ్ఛికం అనుకోలేము కదా? ఇది కూడా నాగ చైతన్య కోసం... అతని కస్టడీ సినిమా ప్రమోషన్స్‌లో భాగమే అని అనుకోవచ్చు కదా?