మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా వస్తున్న ‘భోళాశంకర్’ ఆగస్ట్ 11వ తేదీన విడుదల కాబోతోంది. గత కొన్నిరోజులుగా కోల్‌కతా నగరంలో పార్క్ స్ట్రీట్ వద్ద గల సుప్రసిద్ధ ఇండియన్ మ్యూజియం వద్ద ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూటింగ్ లోకేషన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమాలో చిరంజీవి కోల్‌కతాలో టాక్సీ డ్రైవరుగా, తమన్నా లాయర్‌గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ ఫోటోలు మీ కోసం...
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇంకా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. భోళాశంకర్ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ అందిస్తున్నారు.