
తన డైరెక్షన్ తో పోకిరి లాంటి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మధ్య తన పెన్ను పవర్ ను చూపించడంలో వెనుకపడ్డాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇజం కూడా అటు ఇటు అవడంతో ఈసారి మళ్లీ తన సత్తా చాటాలని ఇంకాస్త కసితో వర్క్ అవుట్ చేస్తున్నాడు పూరి. ఇక అదే ప్రయత్నంలో బాలకృష్ణ కోసం ఓ కథ సిద్ధం చేయబోతున్నాడట. రీసెంట్ గా అమితాబ్ ను కలిసిన బాలయ్య అదే మీటింగ్ లో పూరితో మాట్లాడారట.
పూరి తన సినిమా విషయాన్ని బాలయ్యతో ప్రస్థావించగా త్వరలో డిస్కషన్స్ పెట్టుకుందాం అన్నారట. సో బాలయ్యకు కథ నచ్చితే పూరికి లక్ తగిలినట్టే. అసలు పూరి డైరక్షన్లో బాలయ్య సినిమా అంటేనే ఓ అరుదైన కాంబినేషన్ అని చెప్పాలి. మరి అదే కాంబినేషన్ కనుక సినిమా రూపొందితే కచ్చితంగా రికార్డుల చెడుగుడు ఆడినట్టే. పూరి ఏ జానర్లో బాలకృష్ణ కోసం కథ రెడీ చేస్తాడో కాని ఆ కలయిక సినిమాగా రావాలని ఇరు వర్గాల ఫ్యాన్స్ తెగ ఉత్సాహ పడుతున్నారు.
ప్రస్తుతం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత కృష్ణవంశీ డైరక్షన్లో రైతు సినిమా చేస్తున్నాడు. ఇక అది పూర్తయిన తర్వాత బోయపాటితో కాని అనీల్ రావిపూడితో కాని చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే పూరి ప్రయత్నం సక్సెస్ అయితే కనుక 102 సినిమా మాత్రం పూరితోనే ఉండి తీరుతుంది అంటున్నారు.