సిన్నోడా..ఓ సిన్నోడా... విమానంలో మరో పాట!

విలక్షణ నటుడు సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న విమానం చిత్రం జూన్ 9న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ్ళ సిన్నోడా..ఓ సిన్నోడా... అంటూ సాగే ఓ లిరికల్ వీడియో పాటను రిలీజ్‌ చేశారు. తెలంగాణ గాయని మంగిలి ఎంతో కమ్మగా పాడిన ఈ పాటకు చరణ్ అర్జున్ చక్కటి సంగీతం అందించారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఓ పేద, అంగవైకల్యం కలిగిన తండ్రి కొడుకుల మద్య సాగిన కధ ఇది. ఆకాశంలో వెళుతున్న విమానం చూపించి దానిలో ఎక్కాలని ఉందని కొడుకు అడిగిన్నట్లు ఈ సినిమా టేకాఫ్ ప్రమోలో చూపారు. ఆ నిరుపేద తండ్రీకొడుకుల అనుబందం, కొడుకు కల సాకారం చేయడానికి ఏం చేశాడనేది ఈ సినిమా కధాంశంగా కనిపిస్తోంది.       

ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి జీ స్టూడియోస్‌తో కలిపి ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్: హను రావూరి, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: వివేక్ కాలేపు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.