మెగా హీరో కొత్త గాళ్ ఫ్రెండ్..!

మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ ఓ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. మేనమామల మేనరిజాలను యాజిటీజ్ దించేస్తూ తేజు అతి తక్కువ టైంలోనే మెగా అభిమానుల్లో భలే క్రేజ్ సంపాదించాడు. అయితే మనోడి సినిమాల సందడి ఎలా ఉంటుందో తన మీద గాసిప్పులు కూడా అదే రేంజ్లో విహరిస్తుంటాయి. మొదటి సినిమా రిలీజ్ అదేనండి పిల్లా నువ్వు లేని జీవితం దగ్గర నుండి రెజినాతో రిలేషన్ ఉంది అంటూ రూమర్స్ రాగా దానికి లేదు కాదని చెబుతూనే ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరిగారు.

ఇక ఇప్పుడు రెజినాను వదిలేసి కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ తో సాయి ధరం తేజ్ నైట్ పార్టీలకు అటెండ్ అవుతున్నాడట. రీసెంట్ గా ఓ స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ఇద్దరు ఆ ఈవెంట్ పూర్తి చేసుకున్నాక నైట్ పార్టీ చేసుకున్నారట. దాదాపు అర్ధరాత్రి దాకా ఇద్దరు తిరిగారని టాక్. మరి కెరియర్ మీద దృష్టి పెట్టాల్సిన టైంలో తేజు ఇలా హీరోయిన్స్ తో చెక్కర్లు కొట్టడం ఎంత వరకు కరెక్టో అతనికే తెలియాలి. ప్రస్తుతం ప్రగ్యాతో నక్షత్రం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు తేజు. ఆ పరిచయం కాస్త నైట్ పార్టీలకు వెళ్లేలా చేసింది. మెగా హీరోతో చనువుగా ఉంటే మరిన్ని సినిమాలు వచ్చేస్తాయని ప్రగ్యా కూడా ఈ విషయంలో వచ్చిన వార్తలను పెద్దగా చెవికెక్కించుకోవట్లేదట.