
పలాసా ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా సెబాస్టియన్ దర్శకత్వంలో వస్తున్న నరకాసుర చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ అద్భుతంగా ఉన్నప్పటికీ రెండు నిమిషాలు నిడివి కూడా లేని దానిలో రక్తపాతం చూస్తే ఎవరికైనా కళ్ళు తిరిగిపడిపోవలసిందే అనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మిక్స్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో అపర్ణా జనార్ధన్, సంగీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్ ఓ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ఇంకా శత్రు, చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్, ఎస్ఎస్ కంచి, తేజ్ చరణ్ రాజ్, జి.రాజారావు తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దర్శకుడు సెబాస్టియన్ నోవా ఆకోస్టా అందిస్తున్నారు. సంగీతం: నవఫల్ రాజా, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎడిటింగ్: సీహెచ్.వంశీ కృష్ణ, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్, యాక్షన్: రాబిన్ సుబ్బు అందిస్తున్నారు.
ఈ సినిమాను సుముఖ క్రియెషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.