పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చడీ చప్పుడూ లేకుండా ఈరోజు హటాత్తుగా ఆ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది. అది చూసి అభిమానులు ఎలాగూ సంతోషిస్తారు కానీ దర్శకనిర్మాతలు మాత్రం షాక్ అయ్యే ఉంటారు. ఎందుకంటే దానిని వారు రిలీజ్ చేయలేదు కనుక. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఆ పోస్టర్ తయారుచేసి సోషల్ మీడియాలో పెట్టారు. మే 11న ఫస్ట్ గ్లింప్స్ అని వ్రాసున్న ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గడ్డంతో చాలా రఫ్ అండ్ టాఫ్‌గా కనిపిస్తున్నారు. తమ అభిమాన హీరోని ఎలా చూడాలనుకొంటున్నారో సరిగ్గా అలాగా ఉంది ఆ పోస్టర్. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఈవిదంగానే ఉంటే బాగుండును అనిపించేలా ఉందా పోస్టర్. బహుశః అది చూసి దర్శకనిర్మాతలు కూడా పునరాలోచనలో పడక తప్పదేమో?మీరూ చూడండి...
ఈ సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అయనంకా బోస్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీలీల నటిస్తోంది.