
విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించిన బిచ్చగాడు-2 ట్రైలర్ శనివారం విడుదలైంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌లో చాలా ఆర్ద్రతతో నిండిన అన్నాచెల్లెళ్ళ అనుబందాన్ని చాలా చక్కగా చూపారు. ట్రైలర్‌లో అందుకు పూర్తిభిన్నంగా హీరోని ఎలివేట్ చేస్తూ చూపారు. అది ఏదో రోటీన్‌గా కాక చాలా ఆకట్టుకొనేలా ఉంది. ట్రైలర్ చూస్తే రెండో బిచ్చగాడు కూడా నిర్మాత అంటే విజయ్ ఆంటోనీకి కనకవర్షం కుర్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. బిచ్చగాడు-2లో విజయ్ ఆంటోనీ నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా స్వయంగా చూసుకొంటున్నారు. ఈ సినిమాని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా ఆంటోనీ నిర్మిస్తున్నారు.
బిచ్చగాడు-2ని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో దేవ్ గిల్, జాన్ విజయ్, మన్సూర్ ఆలీ ఖాన్, రాజా కృష్ణమూర్తి, హరీష్ పెరడి, రాధా రవి, వైజీ మహేంద్రన్, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: విజయ్ మిల్టన్, కధ, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం: విజయ్ ఆంటోనీ అందిస్తున్నారు.