జగపతిబాబూ నీకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

ఒకప్పుడు తెలుగు సినిమాలలో శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్ వారి తర్వాత జగపతిబాబు ఫ్యామిలీ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. అయితే వారిలో జగపతిబాబు ఒక్కరే సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రలు కూడా వేసి మెప్పించే అవకాశం పొందలిగారు. అది చాలా మంచి నిర్ణయమని ఆ తర్వాత రుజువైంది. దాంతో తెలుగు సినీ పరిశ్రమకి అచ్చమైన తెలుగు విలన్లు లేరనే చింత తీరిపోయింది. విలన్‌ క్యారెక్టర్స్‌తో పాటు ధనవంతుడైన బిజినెస్ మ్యాన్‌గా, అన్నగా, తండ్రిగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ జగపతిబాబు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. 

తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. పింక్ కలర్ షార్ట్, క్రీమ్ కలర్ ఫ్యాంట్, గాగుల్స్, నెరిసిన జూట్టూ, గడ్డంతో హాలీవుడ్ హీరోలా ఉన్నారు దానిలో. అయితే ఈ వయసులో ఇలా స్టైల్ కొడుతూ ఫోటో పెడితే జనం ఏమనుకొంటారో ఆయనే ఊహించుకొని “అంత ఓవర్ యాక్షన్ అవసరం అంటారా?” అంటూ వెరైటీగా క్యాప్షన్ పెట్టడంతో అది చూసి అందరూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం జగపతిబాబు సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప-2లో, ప్రభాస్‌ హీరోగా వస్తున్న సలార్‌ సినిమాలలో కీలకపాత్రలు చేస్తున్నారు. ఇవి కాక బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు.