మహేష్ సినిమా ఓ మల్టీస్టారర్..?

మహేష్ మురుగదాస్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా మరో పక్క కొరటాల శివతో మహేష్ చేయబోయే సినిమా గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో స్టార్ హీరోని పెట్టే ఆలోచనలో ఉన్నారట శివ. ఇదే విషయాన్ని మహేష్ దగ్గర ప్రస్తావించగా ఓకే అన్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ పాత్రకు బాలకృష్ణ, నాగార్జునను అడిగే అవకాశాలున్నాయట. ఒకవేళ వారిద్దరిలో ఎవరు చేసేందుకు ముందుకు రాకపోతే తమిళ మలయాళ స్టార్స్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే మహేష్ వెంకటేష్ లా కాంబినేషన్ చూసేసిన ప్రేక్షకులు మహేష్ తో ఇతర హీరోల మల్టీస్టారర్ కోరుకుంటున్నారు. ఇక కథ డిమాండ్ మేరకు కొరటాల శివ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాడట. ఇప్పటికే స్టార్ హీరో వేటలో పడ్డాడట శివ. వారు ఓకే అంటే ఇక ఎనౌన్స్ మెంట్ చేయడమే తరువాయి అన్న ఆలోచనలో ఉన్నాడు. జనతా గ్యారేజ్ లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను తెచ్చి సినిమాలో స్పెషల్ క్రేజ్ తెచ్చిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ సినిమాకు మరో స్టార్ హీరోని ప్రయత్నిస్తున్నాడట.

మరి చూస్తుంటే మహేష్ చేసేది మల్టీస్టారర్ సినిమా అనిపిస్తుంది. ఇక ప్రతి సినిమాలోలానే ఒక మెసేజ్ ఈ సినిమాలో ఉండేలా చూస్తున్నాడట కొరటాల శివ. జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ త్వరలో వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.